అగ్గి రాజుకుంది

ABN , First Publish Date - 2020-08-13T17:08:56+05:30 IST

అగ్గి రాజుకుంది

అగ్గి రాజుకుంది

అధికార పార్టీలో లుకలుకలు - సీఎం అభ్యర్థిపై భిన్నస్వరాలు

ఎడప్పాడి పేరుతోనే ఎన్నికల బరిలోకి ఆర్బీ ఉదయకుమార్‌

సరైన సమయంలో ఎంపిక: డి.జయకుమార్‌ 


చెన్నై, (ఆంధ్రజ్యోతి):  రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పడే రాజు కుంది. ప్రతిపక్షాల మాట ఎలా ఉన్నా అధికార అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై అగ్గిరాజు కుంది. పలువురు మంత్రులు భిన్న భిన్న అభిప్రాయాలు వ్యక్త పరుస్తుండడంతో అధికార పార్టీలో లుకలుకలు బయట పడుతున్నాయి. 


వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే పోటీలో దిగుతామని ఓ సీనియర్‌ మంత్రి, అదేమీలేదు ఎన్నికలు పూర్తయిన తర్వాతే సీఎంను ఎమ్మెల్యే లంతా కలిసి ఎన్నుకుంటారని మరో మంత్రి వేర్వేరుగా ప్రకటనలు చేసి సృష్టించిన అలజడి సద్దుమణగక ముందే మరో సీనియర్‌ మంత్రి బుధవారం ఎడప్పాడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే ఎన్నికల బరిలోకి దిగుతా మని ప్రకటించి తాజాగా కల కలం సృష్టించారు. దీంతో అధికార అన్నాడీఎంకేలో అయోమయ పరిస్థితులు కొన సాగుతున్నాయి. ఆ ముగ్గురు మంత్రుల వ్యాఖ్యలపై స్పందించిన మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ అనువైన సమ యంలో ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తామనటంతో వివాదం మరింత జఠిల రూపం దాల్చింది. మంత్రుల ధోరణి చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడంలో తీవ్ర పోటీ నెలకొంటుందని రుజువవుతోంది. తొలుత ఈ వివాదానికి సహాకారశాఖ మంత్రి సెల్లూరు రాజు శ్రీకారం చుట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే లంతా కలిసి ఎన్నుకుంటారని, ఎప్పుడు ఎన్నికలు ప్రకటిం చినా అన్నాడీఎంకే సిద్ధంగా ఉందనే  సెల్లూరు రాజు ప్రకటన పార్టీలో తీవ్ర దుమారం రేపింది.  ఆ నేపథ్యంలో మంగళవారం పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ ట్విట్టర్‌లో సెల్లూరు రాజు ప్రకటనకు విరుద్ధంగా ఓ సందేశం ఇచ్చి సంచలనం సృష్టించారు.  సీనియర్‌ మంత్రులిద్దరు చేసిన ప్రకటనలు సృష్టించిన అలజడి సద్దుమణగక ముందే రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ తెరపైకి వచ్చారు. మదురైలో బుధవారం ఉదయం ఆర్బీ ఉదయకుమార్‌ మీడియాతో మాట్లా డుతూ మినీ అసెంబ్లీ ఎన్నికల్లా జరిగిన ఉప ఎన్నికల్లో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం సమష్టి నాయకత్వంలో విజయం సాధించా మని, వారి పేర్లను చెప్పుకునే స్థానిక సంస్థ ల ఎన్నికల్లోనూ విజయ బావుటా ఎగురవేశామని తెలిపారు. మాజీ ముఖ్య మంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వం తప్పకుండా పతనమవతుందని అందరూ భావిం చారని, ఈపీఎస్‌, ఓపీఎస్‌ సమర్థ వంత పాలనతో మెజారిటీ ప్రభుత్వంగా నిల దొక్కు కుందన్నారు. అంతటితో ఆగకుండా ఎడప్పాడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రక టించిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతామని ఉదయకుమార్‌ అన్నారు.


అప్పుడే తొందరెందుకు?

రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ ప్రకటన చేసిన గంటలోపే ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు కుడిభుజంగా వ్యహరిస్తున్న మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తొందరెందుకుని ప్రశ్నించారు. చెన్నై కాశిమేడు వద్ద బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది నెలల గడు వుందని, ఆలోగా అనువైన సమయలో కాబోయే ముఖ్య మంత్రి అభ్యర్థి పేరును అన్నాడీఎంకే ప్రకటిస్తుందని, అంత వరకు అందరూ సంయమనం పాటించాలని హితవు పలికారు. ఎన్నటికీ ఎడప్పాడే ముఖ్యమంత్రి అంటూ మంతి రాజేంద్ర బాలాజీ చేసిన ప్రకటన పార్టీ నిర్ణయంగా, అభిప్రాయంగా భావించకూడదన్నారు. ఇదే విధంగా ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని మంత్రి సెల్లూరు రాజు, ఎడప్పాడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే ఎన్నికల బరిలోకి దిగుతామని రెవిన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ చేసిన ప్రకటనలకు పార్టీకి సంబంధం లేదని మంత్రి జయకుమార్‌ స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే కొత్త కూటమి ఏర్పాటవుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ వీపీ దురైస్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమేనని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ ఇప్పటి వరకు కూటమి విషయానిన ప్రసావించ లేదన్నారు. ఒకవేళ మురుగన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే అన్నాడీఎంకే అధిష్ఠానం తగిన సమా ధానం చెబు తుందని మంత్రి స్పష్టం చేశారు. అన్నాడీ ఎంకే అనే వటవృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి బలపడుతోందని, ఈ వృక్షాన్ని ఎవరూ పడగొట్టలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే సీనియర్‌ మంత్రుల ఇష్టానుసారంగా వెల్లడిస్తున్న భిన్నస్వరాల కారణంగా అధికార అన్నాడీఎంకేలో వివాదం తారస్థాయికి చేరింది. 

Updated Date - 2020-08-13T17:08:56+05:30 IST