Abn logo
Jun 4 2020 @ 11:07AM

`మాస్టర్‌`తో ప్రారంభం?

లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు పూర్తిగా బంద్ అయిపోయాయి. థియేటర్ల మీద ఆధారపడి జీవించే ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టీవీ సీరియల్‌ షూటింగ్‌లకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా షూటింగ్‌లకు అనుమతినిచ్చింది. ఎడప్పాడి ప్రభుత్వం త్వరలో సినిమా షూటింగ్‌లకు కూడా అనుమతిస్తుందని సినీ నిర్మాతలు, థియేటర్ల యజమానులు భావిస్తున్నారు.


తమిళనాడులో థియేటర్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించిన వెంటనే స్టార్ హీరో విజయ్‌ నటించిన `మాస్టర్‌` చిత్రాన్ని ముందుగా ప్రదర్శించేందుకు థియేటర్ల యజమానులు సిద్ధమవుతున్నారు. జూలైలో సినిమా షూటింగ్‌లు ప్రారంభమవుతాయని, అదే సమయంలో థియేటర్లు కూడా తెరుచుకుంటాయని తమిళనాడు థియేటర్ల యజమానుల సంఘం భావిస్తోంది. అదే జరిగితే రెండు నెలలుగా నష్టపోయిన తమను `మాస్టర్` చిత్రం ఆదుకుంటుందని వారు భావిస్తున్నారు. విజయ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా `మాస్టర్` చిత్రానికి అధికంగా కలెక్షన్లు వస్తాయని, అందుకని ఆ చిత్రాన్నే మొదటగా ప్రదర్శించాలని థియేటర్ల యజమానులు నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల విజయ్‌ అభిమానులు హర్షం ప్రకటిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement