ఒంటరి గున్న ఏనుగుల జోలికి వెళ్లొద్దు

ABN , First Publish Date - 2020-08-13T15:29:17+05:30 IST

ఒంటరి గున్న ఏనుగుల జోలికి వెళ్లొద్దు

ఒంటరి గున్న ఏనుగుల జోలికి వెళ్లొద్దు

చెన్నై: అడవి మార్గంలో ఒంటరిగా సంచరించే గున్న ఏనుగులను వాహన చోదకులు ఇబ్బంది పెట్టరాదని రాష్ట్ర అటవీశాఖ సూచించింది. అంతర్జాతీయ ఏనుగుల దినోత్స వం సందర్భంగా రాష్ట్రంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాల్లోని ఏనుగులకు పౌష్టికా హారాన్ని అందించారు. పశు సంవర్ధక శాఖ అధికారులు ఏనుగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనారోగ్యంతో ఉన్న వాటికి చికిత్స అందించారు. ఈసందర్భంగా అటవీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో. నీలగిరి జిల్లా కున్నూర్‌ నుంచి కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం వరకు ఘాట్‌ రోడ్డులో వందల సంఖ్యలో పనస చెట్లు ఉన్నాయని, ప్రస్తుతం పసన పండ్ల సీజన్‌ కావడంతో ఆ ప్రాంతానికి అడవుల నుంచి ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి వెళ్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం 12 అడవి ఏనుగులతో కూడిన ఓ గుంపు ఆ ప్రాంతంలో మకాం వేసిందన్నారు. అందులో నుంచి తప్పించుకున్న ఓ గున్న ఏనుగు కున్నూర్‌-మేట్టుపాళయంలో రోడ్డులో ఒంటరిగా సంచరిస్తోందని, ఆ మార్గంలో వెళ్లే వాహన చోదకులు దాని జోలికి వెళ్లరాదని హెచ్చరించింది. ఆ ఏనుగు ప్రస్తుతం కేఎన్‌ఆర్‌ నగర్‌ పరిసరాల్లో సంచరిస్తుందని, కొన్ని రోజుల య్యాక మళ్లీ ఏనుగుల గుంపులో కలిసిపోతుందని పేర్కొంది. పర్యాటకులు, వాహనచోదకులు అడవి మార్గంలో ఏనుగులు, వన్యప్రాణులు కనిపించినా మౌనంగా వెళ్లాలని అటవీ శాఖ సూచించింది.


Updated Date - 2020-08-13T15:29:17+05:30 IST