తమిళనాడు విద్యాశాఖ మంత్రికి కొవిడ్-19 పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-01T11:30:06+05:30 IST

తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బలగన్ కు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.....

తమిళనాడు విద్యాశాఖ మంత్రికి కొవిడ్-19 పాజిటివ్

చెన్నై (తమిళనాడు): తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బలగన్ కు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. మంత్రి అన్బలగన్ చెన్నై ఆసుపత్రిలో సీటీ స్కాన్ తీయించుకున్నారు. దానికి ముందు కరోనా మంత్రి నుంచి స్వాబ్ నమూనాలు సేకరించి పరీక్షకు పంపించారు. పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఒకరోజు తర్వాత విద్యాశాఖ మంత్రి అన్బలగన్ కరోనా వైరస్ బారినుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ కేంద్ర మానవవనరులశాఖ మంత్రి రమేష్ కుమార్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. మంత్రి అన్బలగన్ లో మొదట ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని, ఆయన సీటీ స్కాన్ కూడా నార్మల్ గానే ఉందని, అయితే ముందుజాగ్రత్తగానే మంత్రి ఆసుపత్రిలో చేరారని, అతన్ని పరిశీలనలో ఉంచామని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టరు పృథ్వీ మోహన్ దాస్ విడుదల చేసిన హెల్త్ బులిటిన్‌లో తెలిపారు. మంత్రి నుంచి రెండోసారి స్వాబ్ నమూనాలు సేకరించి పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలిందని, మంత్రి దగ్గుతున్నారని, చికిత్స చేస్తున్నామని వైద్యులు చెప్పారు. మంత్రి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు ప్రకటించారు.  

Updated Date - 2020-07-01T11:30:06+05:30 IST