రాష్ట్రంలో 29 శాతం మందికి ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-08-04T14:46:59+05:30 IST

రాష్ట్రంలో ఇప్పటివరకు 29 శాతం మంది మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోగా, రెండు డోస్‌లు వేయించుకున్న వారు 7 శాతంగా ఉన్నారు. రాష్ట్రంలో జనవరి 16 నుంచి ఈ నెల 1వ తే

రాష్ట్రంలో 29 శాతం మందికి ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో ఇప్పటివరకు 29 శాతం మంది మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోగా, రెండు డోస్‌లు వేయించుకున్న వారు 7 శాతంగా ఉన్నారు. రాష్ట్రంలో జనవరి 16 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు 2 కోట్ల 30 లక్షల 71 వేల 282 మంది టీకా వేయించుకోగా, వారిలో 2 కోట్ల 15 లక్షల 6 వేల 329 మంది ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కొవిషీల్డ్‌ కోటి 97 లక్షల 18 వేల 380 మంది వేయించుకోగా, కొవాగ్జిన్‌ 33 లక్షల 52 వేల 902 మంది వేసుకున్నారు. వయసు పరంగా 18నుంచి 44ఏళ్లలోపున్న 85,94,296 మంది, 45 ఏళ్లుపైబడిన వారు 1,29,12,033 మంది టీకా వేయించుకున్నారు. ఆ ప్రకారం, రాష్ట్రంలో 18 ఏళ్లకు పైడిన వారి సంఖ్య 6 కోట్ల 6 లక్షల 15 వేల 919 కాగా, వారిలో కోటి 74 లక్షల 21 వేల 987 మంది అంటే 29 శాతం మంది కరోనా మొదటి డోస్‌ వేయించుకున్నారు. 40,84,342మంది (7శాతం) రెండు డోస్‌లు వేసుకున్నారు.  45 ఏళ్ల పైబడిన వారు 2,19,20,605 మంది ఉండగా, వారిలో 80,03,503 (37 శాతం) ఒక డోస్‌ టీకా, 29,02,631 (13 శాతం)మంది రెండు డోస్‌లు వేయించుకున్నారు. గర్భిణులు 1,61,213 మంది, పాలిచ్చే తల్లులు 1,28,736, దివ్యాంగులు 1,06,893, ఇళ్లులేనివారు 1,322 మంది, మతిస్థిమితం లేని వారు 410 మంది టీకా వేయించు కున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో (ఆగస్టు 1వ తేది వరకు) ప్రభుత్వ టీకా కేంద్రాల్లో  10,86,810 కొవిషీల్డ్‌, 95,163, కొవాగ్జిన్‌ మొత్తం 11,81,973 వ్యాక్సిన్‌ నిల్వలుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,04,727 ఉన్నట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2021-08-04T14:46:59+05:30 IST