‘అనవసరంగా విద్యార్థుల్ని రప్పించొద్దు’

ABN , First Publish Date - 2021-04-14T16:09:24+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను చీటికిమాటికి పాఠశాలలకు రప్పించవద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. కిం

‘అనవసరంగా విద్యార్థుల్ని రప్పించొద్దు’

   - పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశం


చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను చీటికిమాటికి పాఠశాలలకు రప్పించవద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. కింది తరగతి విద్యార్థులకు మూడవ సెమిస్టర్‌ పుస్తకాలు తీసుకునేందుకు, ఉన్నత తరగతి విద్యార్థులు మోడల్‌ పేపర్లతో కూడిన గైడ్లు పొందేందుకు పాఠశాలలకు రావాలని విద్యార్థినీవిద్యార్థులకు పాఠశాలల యజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పాఠశాలల్లోనూ కరోనా వ్యాప్తి తీవ్రంగా వున్న నేపథ్యంలో ఇలా మళ్లీ తమ పిల్లలను రప్పించడమేంటంటూ వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పందించింది. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని అనవసరంగా విద్యార్థులను పాఠశాలకు పిలిపించరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వార్షికోత్సవాల పేరిట క్విజ్‌, వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలంటూ ఒత్తిడి చేయరాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ధీరజ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-04-14T16:09:24+05:30 IST