రాష్ట్రంలో 1,709 మంది వీధి బాలలు

ABN , First Publish Date - 2022-02-22T18:16:53+05:30 IST

తమ రాష్ట్రంలో 1,709 మంది వీధి బాలలు ఉన్నారని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. దేశంలోని వీధి బాలల సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్రాలు, కేంద్ర

రాష్ట్రంలో 1,709 మంది వీధి బాలలు

- భిక్షాటనలో 803 మంది చిన్నారులు 

- సుప్రీంకోర్టులో ప్రభుత్వం ప్రమాణ పత్రం 


అడయార్‌(చెన్నై): తమ రాష్ట్రంలో 1,709 మంది వీధి బాలలు ఉన్నారని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. దేశంలోని వీధి బాలల సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపడుతున్న చర్యలపై సుప్రీంకోర్టు స్వతహాగా విచారణ చేపట్టింది. దీంతో చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ.రమణ సారథ్యంలోని ధర్మాసనం విచారించి, వీధి బాలల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను తెలపాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. ఇందులో రాష్ట్రంలో మొత్తం 1,709 మంది వీధి బాలలున్నట్టు పేర్కొంది. వీరిలో 1,403 మంది ని రక్షించామని, వారిలో 17 మంది చిన్నారులు ఓపెన్‌ హౌస్‌లో, 343మంది విద్యాభ్యాసం,1,454 మంది చిన్నారులకు కౌన్సెలింగ్‌, 331 మందికి అవసరమైన వైద్య సేవలు అందించాం. 803 మంది చిన్నారుల భిక్షాటన చేస్తున్నారు. వీరిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 263 మంది చిన్నారులు అన్ని రకాల కేంద్రరాష్ట్రాల రాయితీలు పొందుతున్నారని అందులో వివరించింది. ఇదే విధంగా మిగిలిన రాష్ట్రాలు కూడా తమతమ రాష్ట్రాల్లో ఉన్న వీధి బాలల గురించి ప్రమాణ పత్రాలను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించాయి.

Updated Date - 2022-02-22T18:16:53+05:30 IST