Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 10:49AM

Tamilandu: తిరుచ్చి జల్లికట్టులో అపశృతి

తమిళనాడు: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జల్లికట్టు పోటీసులు కొనసాగుతున్నాయి. కాగా... తిరుచ్చిలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. పోట్లగిత్తలను లొంగదీసుకునే క్రమంలో 8 మంది యువకులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మదురైనూ జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. జల్లికట్టులో పాల్గొనే ప్రేక్షకుల సంఖ్యపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఈ సంప్రదాయ క్రీడలో ఉత్సహంతో పాల్గొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ జల్లికట్టు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement