'తానా' ఆధ్వర్యంలో గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-09-23T12:44:06+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)... పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్ గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

'తానా' ఆధ్వర్యంలో గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)... పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్ గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా ఆదివారం(సెప్టెంబర్ 27)న ఈ వేడుకలు నిర్వహించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ముఖ్య అతిథి, జ్ఞానపీఠ మూర్తీదేవి పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్(“విశ్వనరుడు జాషువా”) కీలకోపన్యాసం చేయనున్నారు.


ఆత్మీయ అతిధులు:

డా. జి. సమరం

(ప్రముఖ వైద్యులు, బహుగ్రంధ రచయిత)

“జాషువా వ్యక్తిత్వం”


శ్రీ. డొక్కా మాణిక్యవరప్రసాద్

(ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు)

“జాషువా – కొత్తలోకం”


ఆచార్య ఎండ్లూరి సుధాకర్

(హైదరాబాద్ విశ్వవిద్యాలయం)

“జాషువా – గబ్బిలం”


ఆచార్య కొలకలూరి మధుజ్యోతి

(శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి)

“జాషువా – ఫిరదౌసి”


శ్రీ. మువ్వా శ్రీనివాస్

(అధ్యక్షులు – జాషువా సాహిత్య వేదిక, ఖమ్మం)

“జాషువా సాహిత్య ప్రసంగికత”


శ్రీ. ప్రవీణ్ కుమార్ కొప్పోలు

(ప్రముఖ నేపధ్య గాయకుడు)

“జాషువా పద్య వైభవం”


ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు, పాల్గొనవచ్చు:


1. ఫేస్‌బుక్: https://www.facebook.com/tana.org


2. యూట్యూబ్: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw


౩. లైవ్‌లో వీక్షించడానికి: mana TV & TV5 International


4. జూమ్: https://zoom.us/j/3123987419?pwd=V1dyZFFNZzhMbHk5TWZYMWR2RjBVZz09


ఇతర వివరాల కోసం తానా అధికారిక వెబ్‌సైట్ www.tana.orgను సంప్రదించవచ్చు. 



Updated Date - 2020-09-23T12:44:06+05:30 IST