తానా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘తారలు-రాతలు’పై చర్చ!

ABN , First Publish Date - 2021-01-27T18:56:32+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం రోజున సాహిత్య కార్యక్రమాలు గతకొద్ది రోజులుగా జరుగుతున్న విషయం తె

తానా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘తారలు-రాతలు’పై చర్చ!

వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం రోజున సాహిత్య కార్యక్రమాలు గతకొద్ది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 31న భారత కాలమానం ప్రకారం 8.30గంటలకు (అమెరికాలో ఉదయం 7 గంటలకు) ‘తారలు-రాతలు’ అనే అంశంపై సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తానా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, డాక్టర్ కే.వి కృష్ణకుమారి (ప్రఖ్యాత రచయిత్రి), శారదాఅశోకవర్ధన్ (ప్రసిద్ధ రచయిత్రి), రసరాజు (విశిష్ట కవి), కిరణ్‌ప్రభ (కవి).. తదితరులు పాల్గొని వారు సృష్టించిన సాహిత్యంపై సమాలోచన చేయనున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనొచ్చని వెల్లడించింది. తానాకు సంబంధించిన సోషల్ మీడియా వేదికల ద్వారా కార్యక్రమాన్ని వీక్షించొచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు www.tana.org ని సందర్శించాలని కోరింది. 


ఈ కింది లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా కార్యక్రమంలో పాల్గొనొచ్చు.

Facebook: https://www.facebook.com/tana.org

YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw




Updated Date - 2021-01-27T18:56:32+05:30 IST