అమెరికాలో మరో ఫుడ్ ప్యాంట్రీకి ఆర్థిక సాయం అందించిన తానా

ABN , First Publish Date - 2020-06-17T02:47:02+05:30 IST

కొవిడ్-19 కారణంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తానా అండగా నిలుస్తూ వస్తోంది. అమెరికా వ్యాప్తంగా ఎంతో మందికి

అమెరికాలో మరో ఫుడ్ ప్యాంట్రీకి ఆర్థిక సాయం అందించిన తానా

పెన్సిల్‌వేనియా: కొవిడ్-19 కారణంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తానా అండగా నిలుస్తూ వస్తోంది. అమెరికా వ్యాప్తంగా ఎంతో మందికి ఆర్థికంగా సహాయం అందిస్తోంది. తాజాగా పెన్సిల్‌వేనియాలోని ఫోనిక్స్‌విల్లే కమ్యూనిటి ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌కు తానా యూత్ వాలంటీర్ టీం వెయ్యి డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఫోనిక్స్‌విల్లే ఏరియా స్కూల్ డిస్ట్రిక్ట్ సూపర్‌వైజర్ డాక్టర్ ఫెగ్లీకి సోమవారం ఫిలడెల్ఫియా తానా టీం చెక్‌ను అందజేసింది. అమెరికాలో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను స్కూల్ ప్యాంట్రీస్ ఆదుకుంటూ వస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం స్కూళ్లు మూతపడటంతో పిల్లల ఆకలి తీర్చేందుకు తల్లిదండ్రులు వివిధ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో తానా సభ్యులు స్కూల్ ప్యాంట్రీలకు తమకు తోచిన సాయం చేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో రెండు స్కూల్ ప్యాంట్రీలకు సహాయం చేయగా.. తాజాగా మరో ప్యాంట్రీకి ఆర్థికంగా సాయపడింది. ఈ కార్యక్రమాలను ఇదే విధంగా కొనసాగిస్తూ వెళ్తామని తానా తెలిపింది.

Updated Date - 2020-06-17T02:47:02+05:30 IST