కోమటి కమలమ్మ మృతి పట్ల పలువురి సంతాపం

ABN , First Publish Date - 2020-04-10T01:26:00+05:30 IST

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రతినిధి కోమటి జయరాం తల్లి కోమటి కమలమ్మ గురువారం

కోమటి కమలమ్మ మృతి పట్ల పలువురి సంతాపం

టెక్సాస్: తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రతినిధి కోమటి జయరాం తల్లి కోమటి కమలమ్మ గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం) 2:15 గంటలకు కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. కృష్ణాజిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే దివంగత కోమటి భాస్కరరావు సతీమణి కమలమ్మ. కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగానే కాకుండా సమితి అధ్యక్షునిగా, మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. కోమటి భాస్కరరావు చిన్న కుమారుడు సుధాకర్ 1999లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా, మనవడు అప్పసాని సందీప్ 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కరోనా వైరస్‍ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాల మీద నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఇండియా వచ్చే అవకాశాలు లేకపోవడంతో అంత్యక్రియలకు ఇండియాకు వెళ్లలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని జయరాం కోమటి తెలిపారు. కరోనా ఇబ్బందుల కారణంగా ఈరోజు ఉదయమే తల్లి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు చిన్నకుమారుడు సుధాకర్‍ కోమటి తెలిపారు. కాగా, కమలమ్మ మృతి పట్ల అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి పలువురు ఎన్నారైలు జయరాం కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు.

Updated Date - 2020-04-10T01:26:00+05:30 IST