‘తానా - మంచి పుస్తకం’ బాల సాహిత్య రచనల పోటీ ఫలితాలు

ABN , First Publish Date - 2021-08-02T09:54:58+05:30 IST

పిల్లల్లో పఠనాసక్తిని పెంచే ఉద్దేశంతో పదేళ్లు పైబడిన పిల్లలకోసం తానా-మంచి పుస్తకం కలిసి నిర్వహించిన ‘బాల సాహిత్య రచనలు-2021...

‘తానా - మంచి పుస్తకం’ బాల సాహిత్య రచనల పోటీ ఫలితాలు

పిల్లల్లో పఠనాసక్తిని పెంచే ఉద్దేశంతో పదేళ్లు పైబడిన పిల్లలకోసం తానా-మంచి పుస్తకం కలిసి నిర్వహించిన ‘బాల సాహిత్య రచనలు-2021’ పోటీకి మొత్తం 21నవలలు వచ్చాయి. దాసరి వెంకట రమణ, బండ్ల మాధవరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఎంపికైన రచనలు వరుసగా: ‘మాయాలోకం’, పి. చంద్ర శేఖర అజాద్‌; ‘అతీతం’, కిరణ్‌ కమ్మలమడక; ‘క్లిక్‌ - విన్‌’, శాఖమూరి శ్రీనివాస్‌; ‘రక్ష’, వి.ఆర్‌. శర్మ; ‘అంగారక గ్రహం మీద అంతిమ విజయం’, సలీం. ఎంపికైన పుస్తకాల రచయితలు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున పారితోషికాన్ని తానా సంస్థ అందిస్తోంది. పుస్తకాలను నవంబరు 2021 నాటికి ప్రచురిస్తారు. 

జంపాల చౌదరి


Updated Date - 2021-08-02T09:54:58+05:30 IST