ప్రపంచ సాహిత్య వేదికను ప్రారంభించనున్న తానా

ABN , First Publish Date - 2020-05-29T03:26:31+05:30 IST

ప్రపంచ సాహిత్య వేదికను ప్రారంభించనున్న తానా

ప్రపంచ సాహిత్య వేదికను ప్రారంభించనున్న తానా

టెక్సాస్: అంతర్జాలంలో "తానా ప్రపంచ సాహిత్య వేదిక"ను ప్రారంభిస్తున్నామని, తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ,  పర్వ్యాప్తిలో  తానా మరో ముందడుగు వేస్తోందని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి పత్రికా ప్రకటనలో తెలియజేశారు. తెలుగు భాషా ప్రియులు, తానా పూర్వ అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఆధ్యర్యంలో మే 31న ఈ సాహిత్య వేదిక ప్రారంభంకానున్నదని చెప్పారు. ఈ సందర్భంగా డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య సభలు, సమావేశాలు, కవిసమ్మేళనాలు, చర్చలు, అవధానాలతో పాటు కథలు, కవితలు, ఫొటో కవితలు, పద్యాలు, పాటలు, బాల సాహిత్యం లాంటి వివిధ అంశాలలో ప్రపంచ వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తామన్నారు. మే నెల నుంచి ప్రతి నెలా ఆఖరి ఆదివారం రోజున అంతర్జాతీయ దృశ్య సమావేశం జరుపుతామని ప్రకటించారు. కాగా.. ప్రథమ దృశ్య  సమావేశం మే 31న (అమెరికా CDT 11:00 am, ఇండియా 9:30 pm) జరగనుంది. ఈ సాహిత్య సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రముఖ జానపద ప్రజా వాగ్గేయకారుడు శ్రీ. వంగపండు ప్రసాద రావు గారు తన బృంద సభ్యులతో జానపద గానాలతో కనువిందు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ కింద ఉన్న ఏ మాధ్యమాల ద్వారానైనా ఈ దృశ్య సమావేశంలో పాల్గొనవచ్చని ఆహ్వానం పలికారు.   


ఈ లింక్‌ ద్వారా దృశ్య సమావేశంలో పాల్గొనవచ్చు:

1. వెబ్ఎక్స్ లింక్(Webex Link): https://tana.webex.com/tana/j.php?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40


2. ఫేస్‌బుక్ ద్వారా పాల్గొనవచ్చు. 


3. ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వాలనుకునే వారు: 

USA: 1-408-418-9388 

Access code: 798 876 407


మిగిలిన వివరాలకు www.tana.org ను సందర్శించాల్సిందిగా తానా సభ్యులు కోరారు.

Updated Date - 2020-05-29T03:26:31+05:30 IST