Abn logo
Jun 13 2021 @ 00:00AM

తుది దశకు తాండూరు మినీ ట్యాంక్‌బండ్‌

తాండూరు: తాండూరు పట్టణంలో ఉన్న ఏకైక చెరువు గొల్ల చెరువులో మినీ ట్యాంక్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.3కోట్ల 60లక్షల వ్యయంతో చేపడుతున్న ఈపనులను 2019లో ప్రారంభించారు. కట్ట వెడల్పు, రేలింగ్‌, ఫుట్‌పాత్‌, గణేష్‌ ఘాట్‌, బతుకమ్మ మెట్లు పూర్తిచేశారు. వచ్చేనెల మినీ ట్యాంక్‌ బండ్‌ను ప్రజలకు అందుబాటులో తేనున్నారు. ఇప్పటికే 95శాతం మేరకు పనులు పూర్తి కాగా, ప్యాచెస్‌ వర్క్‌, చిన్నచిన్న పనులు 15రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.