సకల శుభకరుడు..శ్రీముఖలింగేశ్వరుడు

ABN , First Publish Date - 2021-12-07T05:01:11+05:30 IST

శ్రీముఖలింగం పేరులోనే ఐశ్యర్యం, విద్య ఉందని..స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని సినీ నటుడు, రచయిత, గాయకుడు తనికెళ్ల భరణి అన్నారు. దేవదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ‘ధర్మపథం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం భరణి తన శిష్య బృందంతో కచేరీ నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచనమిచ్చారు. అందరిలోనూ శివుడు ఉంటాడని.. ఆయన కోసం ప్రపంచమంతా తిరగాల్సిన అవసరం లేదన్నారు.

సకల శుభకరుడు..శ్రీముఖలింగేశ్వరుడు
శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకుంటున్న తనికెళ్ల భరణి

సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి

శ్రీముఖలింగం (జలుమూరు) డిసెంబరు 6: శ్రీముఖలింగం పేరులోనే ఐశ్యర్యం, విద్య ఉందని..స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని సినీ నటుడు, రచయిత, గాయకుడు తనికెళ్ల భరణి అన్నారు. దేవదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ‘ధర్మపథం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం భరణి తన శిష్య బృందంతో కచేరీ నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచనమిచ్చారు. అందరిలోనూ శివుడు ఉంటాడని.. ఆయన కోసం ప్రపంచమంతా తిరగాల్సిన అవసరం లేదన్నారు. శ్రీముఖలింగానికి సుదీర్ఘ చరిత్ర ఉందని గుర్తు చేశారు. తాను నాలుగుసార్లు శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి సాధిస్తుండడం శుభ పరిణామమన్నారు. భవిష్యత్‌లో జిల్లా అభివృద్ధిలో ముందువరుసలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి శిష్యబృందంతో ఆలపించిన పాటలు వీనుల విందుగా సాగాయి. ప్రేక్షకులు, భక్తులను అలరించాయి. అంతకు ముందు ఆయనకు శ్రీముఖలింగంలో ఆత్మీయ స్వాగతం లభించింది. ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. గోత్రనామాలతో పూజలు జరిపించిన అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు అందించి దీవించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తమ్మన్నగారి సతీష్‌కుమార్‌, ఎంపీటీసీ సభ్యుడు కె.హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:01:11+05:30 IST