Abn logo
Jul 9 2020 @ 20:43PM

తనీష్ ‘మహాప్రస్థానం’.. తాజా అప్‌డేట్

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహాప్రస్థానం’. ఈ చిత్రాన్ని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధమవుతున్న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఐ కార్యక్రమాల్లో ఉన్న ‘మహాప్రస్థానం’ చిత్రాన్ని థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేసేందుకు అప్పటికున్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని చిత్ర దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. 


ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ.. ‘‘ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీగా మహాప్రస్థానం సినిమా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఒక మూడ్‌లోకి, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. డీఐ పనులు జరుగుతున్నాయి. ఆల్ మోస్ట్ ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో పరిస్థితిని బట్టి థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అన్నారు. రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న తారాగణం.

Advertisement
Advertisement
Advertisement