దక్షిణ భారతంలో తనిష్క్‌ 100వ షోరూమ్‌

ABN , First Publish Date - 2020-10-18T06:44:53+05:30 IST

టాటా గ్రూప్‌నకు చెందిన ఆభరణాల రిటైలింగ్‌ విభాగం తనిష్క్‌, వాచ్‌ల విక్రయ

దక్షిణ భారతంలో తనిష్క్‌ 100వ షోరూమ్‌

హైదరాబాద్‌ : టాటా గ్రూప్‌నకు చెందిన ఆభరణాల రిటైలింగ్‌ విభాగం తనిష్క్‌, వాచ్‌ల విక్రయ విభాగం వరల్డ్‌ ఆఫ్‌ టైటాన్‌, కళ్లద్దాల విభాగం టైటాన్‌ ఐప్లస్‌, హీలియోస్‌ ఉమ్మడి షోరూమ్‌ను హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో శనివారం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో ఇది తనిష్క్‌ నూరవ షోరూమ్‌ కాగా హైదరాబాద్‌లో 11వది.


హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి వీవీఎస్‌ గ్రూప్‌ ఎండీ వీవీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. టాటా గ్రూప్‌లోని అన్ని లైఫ్‌స్టైల్‌ బ్రాండ్లకు ఏకైక గమ్యంగా ఇది ఉంటుందని ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

ఈ రోజు నుంచి సోమవారం వరకు ఈ షోరూమ్‌లో కొనే ప్రతీ ఆభరణంపై ఒక బంగారు నాణెం, వరల్డ్‌ ఆఫ్‌ టైటాన్‌లో 25 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నామని ఆయన తెలిపారు.


Updated Date - 2020-10-18T06:44:53+05:30 IST