Abn logo
Sep 12 2021 @ 23:29PM

రంగంపేట చెరువులో గుర్రపు డెక్క

గుర్రపు డెక్కతో నిండిపోయిన పశువుల తాగునీటి చెరువు

  • ఇక్కట్లకు గురవుతున్న రైతులు 

రంగంపేట, సెప్టెంబరు 12:  మేజర్‌ పంచాయతీ రంగంపేట గ్రామంలో ఉన్న పశువుల తాగునీటికి ఉపయోగించే చెరువు గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయింది. దీంతో పశువుల నీటి వినియోగానికి ఇబ్బందిగా మారింది. గ్రామం మధ్యలో ఉండే మూడు చెరువులకు గాను ఈ చెరువునిండా గుర్రపు డెక్క ఉండడంతో దానిని నుంచి వచ్చే కాలుష్యం వ్యాప్తి చెందుతోందంటూ చుట్టుపక్కల ఉండే ఇళ్ల వారు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కానీ, గ్రామీణనీటి సరఫరా సంస్థ అధికారులు కానీ ఈ చెరువు గురించి పట్టించుకోవడంలేదని, గుర్రపు డెక్కను తొలగించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.