ఘనంగా 'టాoటెక్స్' నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

ABN , First Publish Date - 2022-01-15T19:23:44+05:30 IST

తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) వారు 2022 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 9వ తేదీన డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు.

ఘనంగా 'టాoటెక్స్' నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

డాలస్/ఫోర్ట్ వర్త్: తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) వారు 2022 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 9వ తేదీన డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్బంగా ఉమామహేష్ పార్నపల్లి సంస్థ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అలాగే మిగతా నూతన కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా ఉమామహేష్ పార్నపల్లి మాట్లాడుతూ.. టాoటెక్స్ లాంటి గొప్ప సంస్థకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాoటెక్స్‌ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు మిగతా సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమాలను ఈ ఏడాది చేపట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు కార్య నిర్వాహక బృందం, పాలక మండలి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఇక 2021 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షురాలుగా పని చేసి, పదవీ విరమణ పొందిన పూర్వాధ్యక్షులు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి మాట్లాడుతూ.. ఉమా మహేష్ పార్నపల్లి నేతృత్వంలో ఏర్పడిన 2022 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన సాక్షి, టీవీ5, మన టి.వి, టీవీ 9లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. మరిన్ని వివరాల కోసం www.tantex.orgని చూడాల్సిందిగా తెలిపారు.


టాంటెక్స్ నూతన అధికారిక కార్యనిర్వాహక బృందం

అధ్యక్షుడు: ఉమామహేష్ పార్నపల్లి

సంయుక్త కార్యదర్శి: ఉదయ్ కిరణ్ నిడిగంటి

ఉత్తరాధ్యక్షుడు: శరత్ రెడ్డి ఎర్రం

కోశాధికారి: సుబ్బారెడ్డి కొండు

ఉపాధ్యక్షులు: సతీష్ బండారు

సంయుక్త కోశాధికారి: భాను ప్రకాష్ వెనిగళ్ల

కార్యదర్శి: సురేష్ పఠనేని

తక్షణ పూర్వాధ్యక్షులు: లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, 

ఇతర సభ్యులు: సరిత ఈదర, స్రవంతి యర్రమనేని, కళ్యాణి తాడిమేటి, మాధవి లోకిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, రఘునాథ రెడ్డి కుమ్మెత, నాగరాజు చల్లా, శ్రీనివాసులు బసాబత్తిన, శ్రీనివాస పాతపాటి, కృష్ణా రెడ్డి మాడ, రాజా మాగంటి, విజయ్ సునీల్ సూరపరాజు


పాలక మండలి బృందం

అధిపతి: వెంకట్ ములుకుట్ల

ఉపాధిపతి: అనంత్ మల్లవరపు

ఇతర సభ్యులు: డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము, గీతా దమ్మన్న, శ్రీ లక్ష్మి మండిగ, శ్రీకాంత్ పోలవరపు, డాక్టర్ వెంకటసుబ్బరాయ చౌదరి ఆచంట









Updated Date - 2022-01-15T19:23:44+05:30 IST