బాలీవుడ్ పాటకి లిప్ సింక్ చేసిన టాంజానియన్స్.. వీడియో వైరల్

సంగీతానికి ఎల్లలు లేవని అందరు అంటుంటారు. టాంజానియాకు చెందిన తోబుట్టువులు ఒక బాలీవుడ్ హిట్ సాంగ్‌ను రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. టాంజానియాకు చెందిన కిలీపాల్, అతడి సోదరితో కలిసి బాలీవుడ్‌ సినిమాలో వచ్చిన ఒక హిట్ సాంగ్‌ను అలపించారు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి  లిరిక్స్‌కు తగ్గట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. దీంతో నెటిజన్లు వారి టాలెంట్‌కు ఫిదా అయ్యారు. పొగడ్తలతో ముంచెత్తడం మొదలుపెట్టారు. 


కియారా అడ్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం షేర్ షా. ఇండియన్ ఆర్మీకి చెందిన విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలోని ‘‘రాతన్ లంబియాన్’’ అనే పాటనే వీరు లిప్ సింక్ చేశారు. గతంలో ఇటువంటి ఎన్నో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తన అభిమానులతో పంచుకోవడం విశేషం.


Advertisement

Bollywoodమరిన్ని...