Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీపీ.అనురాధకు తాపీ ధర్మారావు పురస్కారం

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ’జగము నేలిన తెలుగు - గోదావరి నుండి జావా దాకా’ అనే పుస్తకం రాసిన ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ జర్నలిస్ట్‌ డీపీ.అనురాధకు తాపీ ధర్మారావు పురస్కారం ప్రకటించారు. ఖైరతాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీలో ఈ నెల 12న జరిగే కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించి, అనురాధకు పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తాపీ ధర్మారావు వేదిక కన్వీనర్‌ డాక్టర్‌ సామల రమే్‌షబాబు తెలిపారు. 2009 నుంచి  తొమ్మిది మంది పాత్రికేయులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశామన్నారు. వారందరికంటే అనురాధ పిన్న వయస్కులు కావడం విశేషమన్నారు. అనురాఽధ శ్రీలంక, తాయ్‌లాండ్‌, మలేషియా, వియత్నాం, మయన్మార్‌, ఇండోనేషియా, నేపాల్‌, టిబెట్‌ దేశాలలో పర్యటించి తెలుగు అడుగుజాడలను పరిశోధించి ఈ పుస్తకం రాసినట్లు పేర్కొన్నారు. వేల ఏళ్ల నాడే ఆగ్నేయాసియా దేశాలలో విలసిల్లిన తెలుగుఖ్యాతికి ఆమె అక్షర రూపం ఇచ్చినట్లు తెలిపారు. 

Advertisement
Advertisement