ముకుంద రామారావుకు తాపీ ధర్మారావు పురస్కారం

ABN , First Publish Date - 2020-09-19T06:16:09+05:30 IST

తెలుగు ప్రజలకు చెరగని స్ఫూర్తిగా నిలిచిన తాపీ ధర్మారావు పేరిట ఇస్తున్న పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు యల్లపు ముకుంద రామారావుకు ఇవ్వాలని తాపీ ధర్మారావు వేదిక నిర్ణయించింది.

ముకుంద రామారావుకు తాపీ ధర్మారావు పురస్కారం

తెలుగు ప్రజలకు చెరగని స్ఫూర్తిగా నిలిచిన తాపీ ధర్మారావు పేరిట ఇస్తున్న పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు యల్లపు ముకుంద రామారావుకు ఇవ్వాలని తాపీ ధర్మారావు వేదిక నిర్ణయించింది. అనువాద కళని ఆపోశన పట్టిన రామారావు, ఇప్పుడు ‘అదే నేల’ ద్వారా, దేశంలోని భిన్నభాషల్లో విలసిల్లిన కవిత్వాన్ని వాటి చారిత్రక నేపథ్యంతో మనకు అందించారు. వందలాది భారతీయ భాషల నుంచి దాదాపు 3 వేల మంది కవులని ఆయన ఈ గ్రంథం ద్వారా పరిచయం చేశారు. 700 వందలకు పైగా కవితల్ని అనువదించి భిన్న భాషా జాతుల అస్తిత్వాన్ని గౌరవిస్తూ వాటి మధ్య ఐక్యత కోసం వారధి నిర్మించారు. ప్రాంతం, జాతి, భాష ఏదైనా దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్ధం చేసుకుని దాన్ని కాపాడుకోవడానికి, కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భిన్నకాలాల్లో వెల్లివిరిసిన భారతీయ కవిత్వం దోహదపడుతుందనీ, ‘అదే నేల’ గ్రంథం నిరూపించింది. తాపీ ధర్మారావు 131వ పుట్టినరోజైన నేడు పురస్కార ప్రదానం జరగవలసి ఉంది. కానీ, కొవిడ్‌–19తో నెలకొన్న పరిస్థితుల దష్ట్యా వీలైనంత త్వరలో హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేసి పురస్కారాన్ని ప్రదానం చేస్తాం. 


డాక్టర్‌ సామల రమేష్‌ బాబు, సమన్వయకర్త

Updated Date - 2020-09-19T06:16:09+05:30 IST