Jun 11 2021 @ 23:48PM

ఇప్పట్లో పెళ్లి చేసుకోను: తాప్సీ

కథానాయిక తాప్సీ కొన్నాళ్ల ఆమె డెన్మార్క్‌కు చెందిన మ్యాథ్యూస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గత ఏడాది ఆమె స్వయంగా వెల్లడించింది. ఇద్దరూ కలిసి ఓ విహారానికి కూడా వెళ్లారు. త్వరలో తాప్సీ–మాథ్యూస్‌ వివాహ బంధంతో ఏడడుగులు వేయ్యనున్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై తాప్సీ స్పందించారు. ‘‘ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.   ఏడాదికి ఆరు సినిమాలు చేస్తున్నా. అది రెండు, మూడు సినిమాలకు పడిపోయినప్పుడు పెళ్లి చేసుకుంటాను’’ అని తాప్సీ స్పష్టం చేశారు. సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్న వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోనని  చెప్పిన తాప్సీ  మ్యాథ్యూస్‌ తనకు బాగా తెలిసిన వ్యక్తి అనీ, అతనితో ప్రేమలో ఉన్నాననీ గతంలో తెలిపారు.