Abn logo
Sep 28 2021 @ 00:38AM

జిల్లాలో 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 27: జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రభుత్వం ఈ సారీ ఏ రకం గ్రేడ్‌కు రూ.1960, సాధారణ రకానికి రూ.1940 ధర నిర్ణయించిదని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. కలెక్టరేట్‌లో  సాయంత్రం సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సోమవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.  ఈ వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా లక్షా 73 వేల ఎకరాల్లో వరి పంట లను సాగు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ సీజన్‌లో  4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అంచనా ఉందని కానీ కేవలం 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యమన్నా రు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 262 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో 183 సింగిల్‌ విండోల కేంద్రాలు, 68 ఐకేపీ కేంద్రాలు, 3మెప్మ, 1 మార్కెట్‌ కమిటిల అధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలలో సిబ్బందిని పెంచాలని అధికా రులను అదేశించారు. ఈ సారీ ధాన్యం కొనుగోలు కోసం 87.5లక్షల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రా లకు పంపించాలని సూచించారు. సమావేశంలో డీసీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఎంసీఎస్‌సీ హరికృష్ణ, డీఅర్‌డీవో కౌటీల్యారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.