ముగిసిన మిడతల నివారణ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షణ

ABN , First Publish Date - 2020-06-04T09:55:25+05:30 IST

మిడతల నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షణ బుధవారం

ముగిసిన మిడతల నివారణ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షణ

జ్యోతినగర్‌, జూన్‌ 3 : మిడతల నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షణ బుధవారం ము గిసింది. పంట పొలాలను నాశనం చేస్తున్న మిడతల దండు ఇటీ వల మహారాష్ట్రకు చేరుకున్న నేపథ్యంలో మన రాష్ట్రంలోకి వస్తే చే పట్టాల్సిన ముందస్తు చర్యలపై ఐదుగురు అధికారులతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. బృందం సభ్యులు ఐదు రోజుల పాటు రాష్ట్ర సరిహద్దులో హెలీక్యాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహిం చారు. రాష్ట్రంలోకి మిడతల దండు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు ప్రతి రోజు సమీక్షలు నిర్వహించి సూచనలు చేశారు.


ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని వీఐపీ గెస్ట్‌హౌజ్‌(జ్యోతిభవన్‌)లో బస చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందం నివేదికను తయారుచేసి సీఎం  కేసీఆర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. బుధవారం ఎన్టీపీసీ హె లీప్యాడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. రామగుండం తహసీల్దార్‌ రవీందర్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-06-04T09:55:25+05:30 IST