ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-01-20T04:33:04+05:30 IST

గిరిజన ప్రాంతాల అభి వృద్ధికి ఒక ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఐటీడీఏ పీవో అంకిత్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో కలిసి గిరిజనప్రాంతాల అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహిం చారు.

ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జనవరి 19: గిరిజన ప్రాంతాల అభి వృద్ధికి ఒక ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌రాహుల్‌రాజ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఐటీడీఏ పీవో అంకిత్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో కలిసి గిరిజనప్రాంతాల అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిం చాలని తెలిపారు. ఆప్రణాళికకు అనుగుణంగా అధి కారులు పనిచేయాలన్నారు. అప్పుడే అభివృద్ధి సాధ్య మవుతుందన్నారు. ఆరోగ్యపరంగా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని దీని కోసం తిర్యాణి మండలంలోని ఉండా, మంగి ప్రాంతాల్లో కొత్తసబ్‌సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. గిరిపోషణ 133సెంటర్లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరివికాసం పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలోని సాలెగూడలో పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పూర్తిచేయాలన్నారు. దుబ్బగూడ, మార్ల వాయి గ్రామాల్లో బోర్‌వెల్‌పనులు పూర్తి చేయాలన్నారు. అడప్రాజెక్టు విహార యాత్రలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. బోటింగ్‌ ఏర్పాటుచేసి పర్యాటకులను ఆకర్షించాలన్నారు. రాఘాపూర్‌లోని మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద టూరిజం అభివృద్ధికి చర్యలు తీసు కోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో చేసే ప్రతి అభివృద్ధి పనికి గ్రామసభలు నిర్వహించి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మణెమ్మ, జిల్లా వైద్యాధికారి మనోహర్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:33:04+05:30 IST