పనులు త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-07-30T05:50:51+05:30 IST

మెగా ప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

పనులు త్వరగా పూర్తిచేయాలి
రెడ్లకుంట్లలో మెగా ప్రకృతి వనం పనులపై ఎంపీపీ కవితారెడ్డితో మాట్లాడుతున్న కలెక్టర్‌

కోదాడ రూరల్‌, జూలై 29 : మెగా ప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని రెడ్లకుంట గ్రామంలో మెగా ప్రకృతి వనం పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. వనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందేలా చూడాలన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఎంపీపీ కవితారెడ్డి, వైస్‌ఎంపీపీ మల్లెల రాణిబ్రహ్మయ్య, సర్పంచ్‌ సాతినేని లీలాఅప్పారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లెల పుల్లయ్య, ఎంపీడీవో విజయశ్రీ,  పీవో పాండురంగయ్య, ఏఈ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

అర్హులందరికీ రేషన్‌కార్డులు 

నేరేడుచర్ల: అర్హులందరికీ రేషన్‌కార్డులు అందజేస్తామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. నేరేడుచర్లలో నూతన రేషన్‌ కార్డులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. మండల వ్యాప్తంగా 219 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ       లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలునర్సయ్య, డీసీసీబీ డైరక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డి, వైస్‌ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మినారాయణ, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ చల్లా శ్రీలతారెడ్డి, శ్రీకాంత్‌, తహసీల్దార్‌ సరిత, డీటీ రాంరెడ్డి, ఆర్‌ఐ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:50:51+05:30 IST