టాటా చేతికి తేజ్‌స్‌ నెట్‌వర్క్‌

ABN , First Publish Date - 2021-07-30T05:49:33+05:30 IST

టెలికాం, నెట్‌వర్క్‌ పరికరాల తయారీ సంస్థ తేజస్‌ నెట్‌వర్క్‌.. టాటా గ్రూప్‌ గూటికి చేరుతోంది. పనాటోన్‌

టాటా చేతికి తేజ్‌స్‌ నెట్‌వర్క్‌

డీల్‌ విలువ రూ.1,890 కోట్లు

న్యూఢిల్లీ : టెలికాం, నెట్‌వర్క్‌ పరికరాల తయారీ సంస్థ తేజస్‌ నెట్‌వర్క్‌.. టాటా గ్రూప్‌ గూటికి చేరుతోంది. పనాటోన్‌ ఫిన్‌వెస్ట్‌ అనే అనుబంధ కంపెనీ ద్వారా టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌, తేజస్‌ నెట్‌వర్క్‌ ఈక్విటీలో 43.3 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఇందుకోసం ఒక్కో షేరును రూ.258 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరినట్టు గురువారం రెండు కంపెనీలు ప్రకటించాయి. 43.3 శాతం వాటా కోసం టాటా సన్స్‌ రూ.1,890 కోట్లు చెల్లించనుంది. ప్రిఫరెన్షియల్‌ షేర్లు, వారెంట్ల రూపంలో టాటా గ్రూప్‌ ఈ వాటా తీసుకుంటోంది. మరో 26 శాతం షేర్లను టాటా గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేస్తుంది. 

Updated Date - 2021-07-30T05:49:33+05:30 IST