టాటా... మిస్త్రీ... 70 ఏళ్ళ బంధానికి ఫుల్‌స్టాప్...

ABN , First Publish Date - 2020-09-23T21:19:31+05:30 IST

బ్భై ఏళ్ళుగా టాటా గ్రూప్‌తో తమకున్న బంధాన్ని తెగదెంపులు చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని టాటా సన్స్‌లో అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్‍‌లో హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్‌‌నకు 18.37 శాతం వాటా ఉంది.

టాటా... మిస్త్రీ... 70 ఏళ్ళ బంధానికి ఫుల్‌స్టాప్...

ముంబై : డెబ్భై ఏళ్ళుగా టాటా గ్రూప్‌తో తమకున్న బంధాన్ని తెగదెంపులు చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని టాటా సన్స్‌లో అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్‍‌లో హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్‌‌నకు 18.37 శాతం వాటా ఉంది.


టాటా గ్రూప్‌తో కొనసాగుతున్న న్యాయ వివాదం వల్ల ఆర్థికంగానే కాకుండా ఎంతోమంది జీవనోపాధికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నందున ఆ గ్రూప్ నుండి విడిపోవాల్సిన సమయం వచ్చినట్లు సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఇక... ఎస్పీ గ్రూప్ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ కూడా అంగీకరించింది. అలాగే... మిస్త్రీ కుటుంబం కూడా ఇందుకు సిద్ధమేమని ప్రకటించింది. 


కాగా... బాండ్‌ల చెల్లంపులకు అవసరమైన నిధులను సమీకరించాలని ఎస్పీ గ్రూప్ భావిస్తే... ఆ గ్రూప్‌‌నకున్న 18 శాతం వాటాను కొనుగోలు చేస్తామని సుప్రీం కోర్టుకు టాటా సన్స్ తరఫు న్యాయవాది తెలిపారు. ఒకవేళ... షేర్ల తనఖా ద్వారా నిధులు సమీకరించాలని ఎస్పీ గ్రూప్ ఒకవేళ భావిస్తే... ఆ షేర్లు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదముంటుందని టాటా గ్రూప్ చెబుతోంది. 


దీంతో అక్టోబర్ 28 వ తేదీ వరకు ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీ, ఆయన పెట్టుబడి సంస్థలు టాటా సన్స్ షేర్లను తనఖా పెట్టడం లేదా బదలీ చేయడం వంటివి చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో... ఇప్పటికే తనఖా పెట్టిన షేర్లపై తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబర్ 28 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని కూడా టాటా సన్స్, ఎస్పీ గ్రూప్‌లకు సూచించింది. 


వివాదమిలా... నాలుగు సంవత్సరాల క్రితం... అంటే... 2016 లో పల్లోంజీ తనయుడు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా తొలగించినప్పటి నుండి టాటా సన్స్, సైరస్ మిస్త్రీ కుటుంబాల మధ్య వివాదం ముదిరింది. కరోనా నేపథ్యంలో ఆస్తుల అమ్మకాలు నిలిచిపోవడం, బాండ్‌ల చెల్లింపులు చేసేందుకు టాటా సన్స్‌లో వాటా తనఖా ద్వారా రూ. 11 వేల కోట్లు సమీకరించే యోచనలో ఎస్పీ గ్రూప్ ఉన్నట్లుగా తెలుస్తోంది.


ఇప్పటికే... మార్క్యూ కెనడియన్ ఇన్వెస్టర్‌తో ఒప్పందం కుదిరింది కూడా. అయితే... తమ నిధుల సమీకరణ ప్రణాళికను అడ్డుకునేందుకు టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించిందని ఎస్పీ గ్రూప్ చెబుతోంది. దీంతో మైనార్టీ వాటాదారుల హక్కులకు భంగం కలిగేలా ఆ సంస్థ వ్యవహరిస్తోందని తెలిపింది.


అయితే నిధుల సమీకరణే కావాలంటే మార్కెట్ ధర వద్ద ఎస్పీ గ్రూప్ వాటాను కొనేందుకు సిద్ధమేనని టాట్ గ్రూప్ స్పష్టం చేసింది. అయితే... తనఖా పెట్టే దిశగా ఎస్పీ గ్రూప్ మోచిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటాల నుండి తప్పుకునే సమయం వచ్చిందని మిస్త్రీ కుటుంబం చెబుతుోంది.

Updated Date - 2020-09-23T21:19:31+05:30 IST