ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేసిన టాటా

ABN , First Publish Date - 2021-05-08T00:35:38+05:30 IST

ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేస్తూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి

ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేసిన టాటా

న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేస్తూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి సగటున 1.8 శాతం ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. రేపటి (మే 8) నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. తయారీ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అయితే, మే 7లోపు వాహనాలను బుక్ చేసుకున్న వారికి మాత్రం పాత ధరలే వర్తించనున్నాయి. ఉక్కు, అవసరమైన లోహాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని టాటా మోటార్స్ పేర్కొంది. దీంతో ధరలు పెంచక తప్పలేదని  టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. మే 8వ తేదీ నుంచి పెంపు వర్తిస్తుందన్నారు.  

Updated Date - 2021-05-08T00:35:38+05:30 IST