రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో... టాటా పవర్ రూ. 4 వేల కోట్లు...

ABN , First Publish Date - 2022-04-15T01:54:52+05:30 IST

తన పునరుత్పాదక ఇంధన అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముబాదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సహా బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ నేతృత్వంలోని కన్సార్టియంతో బైండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది.

రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో...  టాటా పవర్ రూ. 4 వేల కోట్లు...

* నిధుల సమీకరణకు యత్నాలు 

ముంబై : టాటా పవర్... తన పునరుత్పాదక ఇంధన అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముబాదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సహా బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ నేతృత్వంలోని కన్సార్టియంతో బైండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ క్రమంలో... టాటా పవర్ భారత అత్యంత సమగ్రమైన పునరుత్పాదక ఇంధన ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 4 వేల కోట్లను సమీకరించనుందని సంస్థ వెల్లడించింది. ‘బ్లాక్‌రాక్ రియల్ అస్సెట్స్, ముబాదలాతో కలిసి, టాటా పవర్ రెన్యూవబుల్స్‌లో 10.53 % వాటా కోసం ఈక్విటీ/కంపల్సరీగా కన్వర్టిబుల్ సాధనాల ద్వారా రూ. 4 వేల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

Updated Date - 2022-04-15T01:54:52+05:30 IST