టాటా X షాపూర్‌జీ పల్లోంజీ... సద్దుమణిగినట్లేనా ?

ABN , First Publish Date - 2020-10-21T02:13:24+05:30 IST

పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టును దేశీయ దిగ్గజ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ పార్లమెంటు బిడ్‌ను పొందే క్రమంలో టాటా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ ఇటీవల ఆరోపించింది.

టాటా X షాపూర్‌జీ పల్లోంజీ... సద్దుమణిగినట్లేనా ?

ముంబై : పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టును దేశీయ దిగ్గజ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ పార్లమెంటు బిడ్‌ను పొందే క్రమంలో టాటా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ ఇటీవల ఆరోపించింది. కాగా... ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు షాపూర్ సంస్థ వెల్లడించింది. ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో షాపూర్ గ్రూప్ తన ఆరోపణలను వెనక్కి తీసుకుంది.



కేంద్ర ప్రజా పనుల విభాగానికి ఎస్పీ గ్రూప్ ఈ మేరకు లేఖ రాసింది. పార్లమెంటు భవనం కాంట్రాక్టుకు సంబంధించి ఇకపై ఎలాంటి ఆరోపణలూ చేయబోమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనులు రూ. 860 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. . 

Updated Date - 2020-10-21T02:13:24+05:30 IST