17 నెలల బాలుడితో సహా ఐసోలేషన్‌ కేంద్రానికి పదిమంది తరలింపు

ABN , First Publish Date - 2020-04-04T09:29:07+05:30 IST

తాటిచెట్లపాలెంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో జీవీఎంసీ అధికారులు శుక్రవారం ఇక్కడకు వచ్చి ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులతోపాటు 17 నెలల బాలుడిని, ఆ భవనం పైభాగం, కింది భాగంలో ఉన్న మరో పదిమందిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. అంతేకాక ఈ ప్రాంతంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

17 నెలల బాలుడితో సహా ఐసోలేషన్‌ కేంద్రానికి పదిమంది తరలింపు

తాటిచెట్లపాలెం: తాటిచెట్లపాలెంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో జీవీఎంసీ అధికారులు శుక్రవారం ఇక్కడకు వచ్చి ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులతోపాటు 17 నెలల బాలుడిని, ఆ భవనం పైభాగం, కింది భాగంలో ఉన్న మరో పదిమందిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. అంతేకాక ఈ ప్రాంతంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.


అధికారుల పర్యవేక్షణ

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో జీవీఎంసీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శాస్ర్తి, సహాయ వైద్యాధికారి డాక్టర్‌ రాజేశ్‌ తదితరులు తాటిచెట్లపాలెంలో పర్యటించారు. స్థానికంగా అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలిచ్చారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, పారిశుధ్య, ఆరోగ్య విభాగం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మరింత సర్వే చేశారు.


అడుగడుగునా బ్లీచింగ్‌, జీవీఎంసీ వాహనంతో క్లోరిన్‌ వాటర్‌, ట్యాంకర్‌తో కెమికల్‌ స్ర్పే చల్లారు. ప్రధాన రహదారులతోపాటు ఇరుకు సందుల్లోకి వెళ్లి భవనాలు, ఇళ్లపై స్ర్పే చేశారు. కాగా పోలీసులు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు ఎవరినీ అనుమతించకుండా రాకపోకలను బంద్‌ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు ఇక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. 

Updated Date - 2020-04-04T09:29:07+05:30 IST