లండన్‌లో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-08-16T00:47:59+05:30 IST

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరం లోని టాక్ కార్యాలయ ఆవరణలో ఉ

లండన్‌లో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్)  ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరం లోని టాక్ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా శుషుమ్నా రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించే క్రమంలో పూర్వీకులు అనేక పోరాటాలు చేశారన్నారు. కులమతాలకు అతీతంగా ఈ పోరాటం జరిగిందన్నారు. ఈ పోరాటంలో ఎందరో వీరనారీమణులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన మహానుభావులను ఆమె స్మరించుకున్నారు.



ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ.. ‘మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్నాం. వారి త్యాగాలు వృథా కాకుండా దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు  మన దేశాన్ని ఎలా అయితే గొప్పగా చూడాలని కలలు కన్నారో.. వాటిని మనమందరం సాకారం చేయాలి. ప్రపంచంలో మన దేశ కీర్తిప్రతిష్టలను రెట్టింపు చేయాలి’ అని వ్యాఖ్యానించారు.


కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్మన్ నవీన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘అహింసా మార్గాన్ని ఎంచుకొని  గాంధీజీ ఎలాగైతే స్వాతంత్య్రాన్ని సాధించారో అదే బాటలో నడిచి ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్ర ఆవిర్భావంతో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో ముందుకు నడుస్తున్నాయి. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. బంగారు తెలంగాణగా రూపొందుతోంది. అనేక రాష్ట్రాలు తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయి. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు’ అని అన్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఈవెంట్స్ కార్యదర్శి మల్లా రెడ్డి బీరంని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ప్రత్యేకంగా అభినందించారు.



ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శుషుమ్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం, మాజీ అధ్యక్షురాలు పవిత్రారెడ్డి కంది, సలహా మండలి వైస్ చైర్మన్ సత్యం రెడ్డి కంది, కమ్యూనిటీ వ్యవహారాల చైర్‌పర్సన్ నవీన్ రెడ్డి, రవి రెటినేని, మల్లా రెడ్డి, భూషణ్, మౌనిక, కె.వి.ప్రసాద్, అవినాష్ కవ్వా, శ్రుజన రాచెర్లా, పృథ్వీ రావుల, శశిధర్ రెడ్డి, మాధవి, నరేష్, వీర్ నాయుడు, సుభాష్, ధర్మేంద్ర, నాగార్జున, అనిల్ రాజ్ దుబ్బా, మేరీ, నరేందర్ జక్కుల తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-16T00:47:59+05:30 IST