పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-01-21T04:51:28+05:30 IST

జీవీఎంసీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు.

పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ సృజన

జీవీఎంసీ కమిషనర్‌ సృజన 

సిరిపురం, జనవరి 20: జీవీఎంసీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనా థియేటర్‌లో పన్నుల వసూళ్ల పురోగతిపై ఏడీసీ ఆశాజ్యోతి, డీసీఆర్‌, జోనల్‌ స్థాయి అధికారులు, సచివాలయాల పరిపాలనా కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, నీటి చార్జీలు, డీ అండ్‌ వో లైసెన్స్‌ ఫీజులు, కల్యాణ మండపాలు, దుకాణాలు, మార్కెట్ల నుంచి రావాల్సిన ఫీజులు, అద్దెలను వంద శాతం వసూలు చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లు టార్గెట్‌ పెట్టగా.. ఇప్పటివరకు రూ.227.40 కోట్లు వసూలైందని, ఫిబ్రవరి నెలాఖరుకల్లా 95 శాతం వసూలు చేయాలని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-01-21T04:51:28+05:30 IST