Advertisement
Advertisement
Abn logo
Advertisement

రంగురంగుల ట్యాక్సీలపై రకరకాల మొక్కలు... వాహనాలు మూలపడటంతో అవి మొలవలేదు... కారణం తెలిస్తే అయ్యో... అంటారు!

ఈ ఫొటోలోని కార్లను చూసి... ఇవేవో పాడయిపోయిన కార్లని, వాటిపై మొక్కలు మొలిచాయని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఇవి ఓ వినూత్న వ్యవసాయానికి సంబంధించినవి. థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లోగల ఒక గ్యారేజీలో కనిపిస్తున్న ఈ రంగురంగుల కార్లు కరోనా చూపించిన విలయానికి గుర్తుగా నిలిచాయి. లాక్‌డౌన్ సమయంలో ట్యాక్సీ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. రాట్చప్రూక్ టాక్సీ కోఆపరేటివ్ అనే కంపెనీ కరోనా కాలంలో ఆర్థికంగా కోలుకోలేని స్థాయిలో దెబ్బతింది. 

చివరికి ఆ కంపెనీ యజమాని ఆ కార్ల టాప్‌లపై కూరగాయలు పండిస్తున్నాడు. ఇలా పండించిన పంటను స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు. పర్యాటక ప్రాంతమైన బ్యాంకాక్‌లో ట్యాక్సీల వ్యాపారం బాగా సాగుతుంటుంది. అయితే కరోనా కారణంగా ఈ వ్యాపారం మూతపడే స్థాయికి చేరింది. దీంతో ఈ వ్యాపారంపై ఆధారపడినవారంతా దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నారు. రాట్చప్రూక్ టాక్సీ కోఆపరేటివ్ కంపెనీ యజమాని కమోల్పోర్న్ బూనిత్యోంగ్ మాట్లాడుతూ ఇన్నాళ్లూ ట్యాక్సీల వ్యాపారం చేసిన మాకు ఇదొక్క మార్గమే కనిపించింది. ట్యాక్సీల పైకప్పులపై కూరగాయలు పండిస్తూ, మరికొందరికి కూడా ఉపాధి కల్పిస్తున్నామని, థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి ఇప్పటికైనా ఆదుకోవాలని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement