టీసీఎస్... అత్యంత విలువైన కంపెనీ... మరోమారు ఘనత...

ABN , First Publish Date - 2021-01-26T21:22:31+05:30 IST

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)… మరో ఘనతను సాధించింది. అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. నిన్న(సోమవారం) మరో ఐటీ సంస్థ యాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది.

టీసీఎస్... అత్యంత విలువైన కంపెనీ... మరోమారు ఘనత...

న్యూఢిల్లి : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)… మరో ఘనతను సాధించింది. అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. నిన్న(సోమవారం) మరో ఐటీ సంస్థ యాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. టీసీఎస్‌ మార్కెట్‌ విలువ సోమవారం ఉదయం 169.9 బిలియన్‌ డాలర్లను(రూ. 12. 34 లక్షల కోట్లు) దాటిందని ఆ కంపెనీ సీఈఓ రాజేష్‌ గోపినాధన్‌ వెల్లడించారు. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో యాక్సెం చర్‌ మార్కెట్‌ క్యాప్‌ 168.4 బిలియన్‌ డాలర్లు(రూ.12.27 లక్షల కోట్లు). రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ 168.5 బిలియన్‌ డాలర్లు (రూ. 12.29 లక్షల కోట్లు)గా ఉంది. కాగా మార్కెట్‌ క్యాప్‌‌నకు సంబం ధించి టీసీఎస్‌ గతంలో కూడా రెండు సార్లు యాక్సెంచర్‌ కంపెనీని అధిగమించింది. రెండేళ్ళ క్రితం... 2018 లో ఒకమారు, గతేడాది అక్టోబరులో మరోమారు యాక్సెంచర్‌ను టీసీఎస్‌ అధిగమించింది. 


Updated Date - 2021-01-26T21:22:31+05:30 IST