అమెరికన్లకే అధిక ప్రాధాన్యమిచ్చేందుకు సిద్దమైన భారత ఐటీ సంస్థలు

ABN , First Publish Date - 2020-05-26T01:20:33+05:30 IST

భారత్‌లో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థగా పేరుగాంచిన టీసీఎస్.. హెచ్1బీ వీసాలపై

అమెరికన్లకే అధిక ప్రాధాన్యమిచ్చేందుకు సిద్దమైన భారత ఐటీ సంస్థలు

న్యూఢిల్లీ: భారత్‌లో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థగా పేరుగాంచిన టీసీఎస్.. హెచ్1బీ వీసాలపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. అమెరికాలో ఉన్న టీసీఎస్ సంస్థల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటోంది. ప్రతి ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం 2.5 రెట్లు ఎక్కువ మంది అమెరికన్లను సంస్థలోకి తీసుకున్నట్టు టీసీఎస్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కడ్ తెలిపారు. గత ఐదేళ్లలో తాము 20 వేల మంది అమెరికన్లకు ఉద్యోగం కల్పించినట్టు ఆయన చెప్పారు. గ్యాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని సంస్థలోకి తీసుకుని కొత్త టెక్నాలజీలపై ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. హెచ్1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుండటంతోనే టీసీఎస్ ఈ పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే టీసీఎస్‌లో హెచ్1బీ వీసాపై పనిచేసే వారిలో అత్యధికంగా భారతీయులే ఉంటారు. ఇప్పుడు హెచ్1బీ ప్రాధాన్యాన్ని తగ్గిస్తుండటంతో భారత్‌లోని టీసీఎస్ సంస్థల్లో కూడా ఉద్యోగులు తగ్గుతారా అనే ఆందోళన మొదలైంది. దీనిపై కూడా మిలింద్ స్పందించారు. అలాంటిది ఏమీ లేదని.. పైగా భారతదేశంలోని తమ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య మరింత పెరుగుతూ వెళ్తోందన్నారు. కాగా.. టీసీఎస్‌తో పాటు ప్రముఖ భారత దిగ్గజ సంస్థలు విప్రో, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ సంస్థలు కూడా అమెరికన్లకే అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్దమయ్యాయి.

Updated Date - 2020-05-26T01:20:33+05:30 IST