టీసీఎస్‌ నెం.1

ABN , First Publish Date - 2021-01-26T06:56:18+05:30 IST

దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌).. రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సను వెనక్కి నెట్టి దేశంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. సోమవారం బీఎ్‌సఈలో టీసీఎస్‌ షేరు 0.40

టీసీఎస్‌ నెం.1

రూ.12.34 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ 

ప్రపంచ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ను.. దేశంలో రిలయన్స్‌ను అధిగమించిన కంపెనీ 


న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌).. రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సను వెనక్కి నెట్టి దేశంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. సోమవారం బీఎ్‌సఈలో టీసీఎస్‌ షేరు 0.40 శాతం నష్టంతో రూ.3,290.20 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12,34,609.62 కోట్లకు పరిమితమైంది. కాగా రిలయన్స్‌ షేరు 5 శాతానికి పైగా క్షీణించడంతో మార్కెట్‌ విలువ రూ.12,29,661.32 కోట్లకు పడిపోయింది. దాంతో టీసీఎస్‌ అగ్రస్థానాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగింది. 

యాక్సెంచర్‌నూ దాటేసింది: స్వల్పకాలం పాటు యాక్సెంచర్‌ను దాటేసి ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటీ కంపెనీగానూ టీసీఎస్‌ అవతరించింది. గత శుక్రవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లో ట్రేడింగ్‌ ముగిసేసరికి యాక్సెంచర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 16,844 కోట్ల డాలర్లుగా నమోదైంది. సోమవారం బీఎ స్‌ఈ ప్రారంభ ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేరు అర శాతం మేర లాభపడి ఏడాది గరిష్ఠ స్థాయి రూ.3,345కు చేరుకుంది.


దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ 16,926 కోట్ల డాలర్లకు ఎగబాకింది. తద్వారా యాక్సెంచర్‌ మార్కెట్‌ విలువను అధిగమించింది. కానీ, చివర్లో టీసీఎస్‌ షేర్లు నష్టాల్లోకి జారుకోవడంతో మళ్లీ రెండో స్థానానికి పరిమితమైంది. గత ఏడాది అక్టోబరులోనూ టీసీఎస్‌ స్వల్పకాలంపాటు ప్రపంచ నెం.1 ఐటీ కంపెనీగా నిలిచింది. 


ఆధార్‌ హౌసింగ్‌ రూ.7,300 కోట్ల ఐపీఓ 

 ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రానుంది. ఈ మేర కు సెబీకి దరఖాస్తు సమర్పించింది. ఇష్యూ ద్వారా రూ.7,300 కోట్లు సమీకరించనుంది.  కాగా సోమవారంతో ముగిసిన హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ ఇష్యూ సైజుతో పోలిస్తే 26.57 రెట్ల బిడ్లు వచ్చాయి. 


మళ్లీ నష్టాలే.. 

సెన్సెక్స్‌ 531 పాయింట్లు డౌన్‌ 

వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఐటీ, ఇంధన కంపెనీల షేర్లలో అమ్మకాలు పెరగడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ట్రేడింగ్‌లో 1000 పాయింట్లకు పైగా నష్టంతో ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌.. చివరికి 530.95 పాయింట్లు నష్టపోయి 48,347.59 వద్ద క్లోజైంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 14,238.90 వద్ద ముగిసింది. గడిచిన 3 సెషన్లలో సెన్సెక్స్‌ 1,444.53, నిఫ్టీ 405.80 పాయింట్లు పతనమయ్యాయి.


 సోమవారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సెన్సెక్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను మెప్పించలేకపోవడంతో షేరు ధర 5.36 శాతం పతనమై రూ.1,939.70కు జారుకుంది.  కాగా యాక్సిస్‌ బ్యాంక్‌ మాత్రం 2.19 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

Updated Date - 2021-01-26T06:56:18+05:30 IST