జూన్‌ నాటికి ఊరికో ఇల్లు అయినా కడతారా?: టీడీపీ

ABN , First Publish Date - 2021-05-07T09:58:02+05:30 IST

‘‘జూన్‌ నాటికి 30 లక్షల ఇళ్లు కట్టేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పేదల్లో భ్రమలు కల్పిస్తున్నారు. ఆ నాటికి అసలు ఊరికో ఇల్లు అయినా కట్టగలరా?’’ అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి

జూన్‌ నాటికి ఊరికో ఇల్లు అయినా కడతారా?: టీడీపీ

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘జూన్‌ నాటికి 30 లక్షల ఇళ్లు కట్టేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పేదల్లో భ్రమలు కల్పిస్తున్నారు. ఆ నాటికి అసలు ఊరికో ఇల్లు అయినా కట్టగలరా?’’ అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి బత్యాల చెంగల్రాయుడు గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పధకం కింద గత రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌ పార్లమెంటు సాక్షిగా చెప్పారని, ఈ ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమని అన్నారు. ‘‘పేదలకు ఇళ్ల పేరుతో జేబులు నింపుకోవడంలో ఉన్న ఆసక్తి నిర్మాణాలపై లేదు. భూముల రేట్లు పెంచి, వాటిని మెరక చేసే పేరుతో కుంభకోణాలు చేసి అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రూ.ఆరున్నర వేల కోట్లు దోచుకొన్నారు. అవే డబ్బులు సవ్యంగా ఖర్చు చేసి ఉంటే పేదలకు వారి నివాసాలకు దగ్గర్లోనే మరింత మంచి భూములు దొరికేవి’ అని అన్నారు. 

Updated Date - 2021-05-07T09:58:02+05:30 IST