Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇలానే ఉంటే ఉద్యమం గ్యారంటీ: టీడీపీ నేత

పశ్చిమగోదావరి: కాపు ఉద్యమ నేతలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒకలాగా, జగన్ హయాంలో మరోలాగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత వలవల బాజ్జి అన్నారు. నేతలు ఇలానే ఉంటే ఇకనుండి తెలుగుదేశం పార్టీ కాపుల తరుపున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో  కాపు కార్పొరేషన్ చైర్మన్ ఒక ఉత్సవ విగ్రహంలా ఉండడం తప్ప ఒక్క లోన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. కోటి యాభై లక్షల మంది ఉన్న కాపులలో కేవలం 3లక్షల మంది కాపు మహిళలకు కాపు నేస్తం ఇచ్చి పేపర్ లో పెద్ద పబ్లిసిటీ చేసుకున్నారని పేర్కొన్నారు. కాపులకు మోసపూరిత వాగ్ధానాలు చేసి కాపులను దగా చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement