మంత్రులు కాదు.. జగన్‌ బంట్రోతులు

ABN , First Publish Date - 2021-03-08T10:35:17+05:30 IST

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు, అమ్మవారి చీరలను కాజేసి అమ్ముకునేవాడు దేవదాయ మంత్రా? ఆయన హయాంలో

మంత్రులు కాదు..  జగన్‌ బంట్రోతులు

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు, అమ్మవారి చీరలను కాజేసి అమ్ముకునేవాడు దేవదాయ మంత్రా? ఆయన హయాంలో దుర్గగుడిలో అవినీతి కంపు కొడుతోంది. అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలు మాయమైపోయినా అతీగతీ లేదు. రామతీర్థంలో రాముడి తల నరికేసినా పట్టించుకోడు. జగన్మాత కనకదుర్గమ్మ కొలువైన స్థానంలో అవినీతి కంపు కొడుతుంటే మీకు రోషం రావడం లేదా? నాపై అభిమానం లేకపోయినా.. కనీసం ఆ దేవతపైనైనా అభిమానం ఉండాలి. అమ్మవారి రథంపై వెండి సింహాలు మాయమైపోతే కనబడదా మీకు? ఆ తల్లి కన్నెర్రజేస్తే తప్ప మీరు కళ్లు తెరవరా? ఏమైంది మీ రోషం? ఏమైంది తెలుగువారి ఆత్మగౌరవం? ఇదే జిల్లాలో ఇంకొకడున్నాడు. బూతుల మంత్రి. వాడి మనుషులతో పేకాట ఆడిస్తాడు. పోలీసులు పట్టుకుంటే సిగ్గుపడాల్సిందిపోయి.. పేకాడితే తప్పేంటని అంటాడు. పోలీసులు కేసు పెడితే ఫైన్‌ కట్టి మళ్లీ పేకాట ఆడకుంటామంటాడు. ముఖ్యమంత్రి పర్మిషన్‌ ఇస్తాడు.


పుంగనూరు పుడింగి కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నాడు. ఈ పుడింగికి కృష్ణానదిలో కొంత భాగాన్ని, ఇంకో మంత్రికి మరో బిట్టును ధారాదత్తం చేసి మొత్తం దోచుకుంటారంట! రెండేళ్లుగా సామాన్యులకు గంపెడు ఇసుక దొరకకుండా మొత్తం బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్క జిల్లాలో మరో హవాలా మంత్రి ఉన్నాడు. వీళ్లంతా మంత్రులా? జగన్‌ బంట్రోతులు. జగన్‌ పత్రికలో గుమాస్తాగా పని చేసిన మరో వ్యక్తి నాకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నా రాజకీయ జీవితంలో ఈ గుమాస్తా ఎంత? ఇలాంటి వారిని చాలామందినే చూశాను. బెదిరింపులకు భయపడేవాడిని కాదు. విశాఖపట్నంలో ఏ-2.. 10 వేల ఎకరాల భూములను కబ్జా చేసేశాడు. అక్కడ కోటీశ్వరుల ఆస్తులను భయపెట్టి రాయించేసుకుంటున్నాడు. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను నేరస్థులకు అడ్డాగా మార్చేశారు. రాష్ట్రం వాళ్లబ్బ జాగీరనుకుంటున్నారా?

Updated Date - 2021-03-08T10:35:17+05:30 IST