రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-09-17T05:03:49+05:30 IST

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. రైతులతో కలిసి నెల్లూరు రూరల్‌ తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు. ముందుగా నాగలి, వరి ధాన్యంతో ప్రదర్శన నిర్వహించారు.

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
రైతులతో కలిసి ప్రదర్శన నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

నిరసనలో టీడీపీ నాయకులు 

నెల్లూరు రూరల్‌, సెప్టెంబరు 16 : రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. రైతులతో కలిసి నెల్లూరు రూరల్‌ తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు. ముందుగా నాగలి, వరి ధాన్యంతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జెన్ని రమణయ్య, సారంగం గున్నయ్య మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలను కాలరాసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు. రైతాంగానికి కనీస మద్దతు ధర దక్కే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ధరలు లేకపోవడంతో ఖరీఫ్‌లో సాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ క్రాపు హాలిడే ప్రకటించాల్సిన దుస్థితికి రైతులు చేరుకున్నారన్నారు. రైతులకు అందాల్సిన రాయితీలు కనుమరుగైపోయాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు అన్నం దయాకర్‌గౌడ్‌, పొత్తూరి శైలజ, పాశం గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T05:03:49+05:30 IST