Abn logo
Sep 21 2021 @ 00:29AM

కార్యకర్తల శ్రేయస్సే టీడీపీ లక్ష్యం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న టీడీపీ నాయకులు

కళ్యాణదుర్గం, సెప్టెంబరు20: కార్యకర్తల శ్రేయస్సే టీడీపీ లక్ష్యమని ఆపార్టీ సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహనచౌదరి, అనంతపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు  వైపీ రమేష్‌ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 13వ వార్డు వడ్డే కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళా కార్యకర్త వడ్డే నాగమ్మ, శెట్టూ రు మండలం ఐదుకల్లు గ్రామ మాజీ సర్పంచు చట్టం రామాంజనేయులు చెల్లెలు గంగరత్నమ్మలను నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి చంద్రన్న ఆర్థిక సాయం కింద రూ.10వేల చొప్పున నగ దు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబాలకు తమవంతు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలోమార్కెట్‌ యార్డు మాజీ చైర్మన పాపంపల్లి రామాంజనేయులు, ము న్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్‌చౌదరి, మాజీ ఎంపీపీ మంజుళవన్నూర్‌స్వామి, ఊటంకి రామాంజనేయులు, హనుమంతరెడ్డి, గొ ర్ల గోవిందరాజులు, వన్నూర్‌స్వామి, బసవరాజు, వెలుగు లోకేష్‌, జయమ్మ, టైలర్‌ జ్యోతి, పెద్దన్న, నారాయణస్వామి, ఎర్రిస్వామి, గొల్ల రామచంద్ర, కి ష్టప్ప, తిప్పేస్వామి, దాసరి ఆంజనేయులు, తిమ్మరాజులు,శీనప్ప పాల్గొన్నారు.