అనంతపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2020-08-08T01:45:26+05:30 IST

అనంతపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ధర్నాకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా

అనంతపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన

అనంతపురం: అనంతపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ధర్నాకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. విడుదలైన 24 గంటల్లోపే వారిద్దర్నీ అరెస్ట్ చేయడం గమనార్హం. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం నాడు అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఏకంగా ప్రభాకర్‌రెడ్డిపై సీఐ దేవేంద్రకుమార్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప నుంచి వస్తున్న ప్రభాకర్‌రెడ్డి వాహనాలను సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కేసు నమోదు చేయడం జరిగింది. 


Updated Date - 2020-08-08T01:45:26+05:30 IST