టీడీపీ బంద్‌కు అడుగడుగున అడ్డుకులు

ABN , First Publish Date - 2021-10-21T02:51:47+05:30 IST

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ మూకలు చేసిన దాడికి నిరసనగా టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు బుధవారం కావలిలో చేపట్టిన రాష ్ట్రబంద్‌ను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు.

టీడీపీ బంద్‌కు అడుగడుగున అడ్డుకులు
ఉదయగిరి : పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ నాయకులు

నేతల హౌస్‌ అరెస్ట్‌

ర్యాలీలను అడ్డుకున్న పోలీసులు

కావలి, అక్టోబరు 20: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ మూకలు చేసిన దాడికి నిరసనగా టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు బుధవారం కావలిలో చేపట్టిన రాష ్ట్రబంద్‌ను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తెల్లవారుజాము నుంచే టీడీపీ ముఖ్య నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, గ్రంధి యానాదిశెట్టి, కాకి ప్రసాద్‌, బొట్లగుంట శ్రీహరినాయుడు, యోగూరి చంద్రశేఖర్‌, అన్నపూర్ణ శ్రీను తదితరుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు వారిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా సాయంత్రం వరకు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కొందరు నేతలు ముందుగానే ఇంటి వద్ద లేకుండా తప్పించుకుని తన అనుచరులతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి శాంతియుత నిరసన తెలియ చేసేందుకు బ్యానర్‌తో ర్యాలీగా బయటకు రాగా డీఎస్పీ డీ.ప్రసాద్‌ తన సిబ్బందితో కలసి అడ్డుకుని బ్యానర్‌ను చింపివేశారు. ప్రతిఘటించిన నేతలు కండ్లగుంట మధుబాబు నాయుడు, గుత్తికొండ కిషోర్‌, జ్యోతి బాబూరావు, మొగిలి కల్లయ్య, దావులూరి దేవకుమార్‌, దామా మాల్యాద్రి, పల్లపు కుమార్‌ తదితరులను అరెస్టు చేసి ఒకటో పట్ఠణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు. అలాగే కావలి, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలోని ఉదయగిరి, జలదంకి, వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, కలిగిరి, కొండాపురం, అల్లూరు, బిట్రగుంట, దగదర్తి మండలాల్లో బంద్‌కు యత్నించిన టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.    












Updated Date - 2021-10-21T02:51:47+05:30 IST