నిర్బంధించినా.. నినదించిన గళం

ABN , First Publish Date - 2021-10-21T04:18:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ నాయకుల నివాసాలు, పార్టీల కార్యాలయాలే టార్గెట్‌గా మంగళవారం అధికార వైసీపీ శ్రేణులు చేసిన దాడులు.. దీనిని నిరసిస్తూ బుధవారం రాష్ట్రబంద్‌కు టీడీపీ పిలుపు ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు బంద్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి నుంచే యాక్షన ప్లానలోకి దిగారు.

నిర్బంధించినా..  నినదించిన గళం
నెల్లూరులో కోటంరెడ్డి శ్రీనివాసులును అరెస్టు చేస్తున్న పోలీసులు

‘బంద్‌’కు అడుగడుగునా ఆటంకాలు

ఎక్కడికక్కడ టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

వైసీపీ వైఖరికి నిరసనగా రాస్తారోకోలు, ప్రదర్శనలు 

ఎక్కడిక్కడ అడ్డుకున్న పోలీసులు. 


చేసేందే అరాచకం.. దీనిని నిరసిస్తూ పిలిపునిచ్చిన బుధవారం నాటి బంద్‌కు అడుగడుగునా ఆటంకాలు. తెలుగుదేశం పార్టీ నేతలెవరినీ రోడ్లపైకి రానివ్వకుండా పోలీసులు ఇళ్లలోనే నిర్బంధించేశారు. పోలీసులు వెంటాడుతున్నా, అడ్డుతగులుతున్నా, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం బెదరలేదు. తమ పోరాట పటిమ చూపారు. ప్రధాన కూడళ్లు, రహదారులు, పోలీస్‌ స్టేషన్లు ఇలా ప్రతిచోటా వైసీపీ మూక ఆగడాలపై నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరును ఎండగట్టారు. 


నెల్లూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నాయకుల నివాసాలు, పార్టీల కార్యాలయాలే టార్గెట్‌గా మంగళవారం అధికార వైసీపీ శ్రేణులు చేసిన దాడులు.. దీనిని నిరసిస్తూ బుధవారం రాష్ట్రబంద్‌కు టీడీపీ పిలుపు ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు బంద్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి నుంచే యాక్షన ప్లానలోకి దిగారు. స్థాయి కలిగిన టీడీపీ నాయకులను ఇళ్లు కదలనివ్వకుండా హౌస్‌ అరెస్టులతో కట్టిపడేశారు. బయటకు వచ్చిన కార్యకర్తలను అడ్డుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. పలువురి మీద కేసులు నమోదు చేశారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా  వైసీపీ అప్రజాస్వామ్యక చర్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడంలో టీడీపీ సేనలు విజయవంతం అయ్యాయి. శాంతియుత ఆందోళనల ద్వారా ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులను ప్రజలకు తెలియజెప్పాయి. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునందుకున్న టీడీపీ కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా బంద్‌కు ఉపక్రమించారు. దాదాపుగా అన్ని మండలాల్లో, ముఖ్య పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు వెంటాడుతున్నా, అడ్డుతగులుతున్నా, అరెస్టులు చేస్తున్నా లెక్కచేయక నిరసన వ్యక్తం చేశారు. 


నెల్లూరులో బుధవారం వేకువజామునే పోలీసులు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి సోమిరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిలను హౌస్‌ అరెస్టు చేశారు. ఎన్టీఆర్‌ నగర్‌, బుజబుజనెల్లూరు వద్ద జాతీయ రహదారిపై టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. తెలుగు యువత నాయకులు ఆత్మకూరు బస్డాండు వద్ద,  టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు వీఆర్‌సీ సెంటర్‌ వద్ద ధర్నా చేశారు. 

వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌లను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ రెండు పట్టణాల్లో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. 

నాయుడుపేటలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంను హౌస్‌ అరెస్టు చేశారు. ధర్నాకు దిగిన టీడీపీ నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.  ఆత్మకూరులో టీడీపీ నాయకులు నెల్లూరుపాలెం సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. 

కావలిలో ముఖ్య నాయకులను ఉదయమే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. 


స్టేషనబెయిల్‌ కేసును కోర్టుకు తెస్తారా!?


తెలుగు యువత నగర అధ్యక్షుడు గొడ్డేటి నాగేంద్ర ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు నవాబుపేట పోలీసు స్టేషనకు తరలించారు. అయితే నాగేంద్రపై నాన బెయిలబుల్‌ కేసు నమోదు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. కానీ ఈ కేసును న్యాయమూర్తి తిప్పి పంపినట్లు తెలిసింది. స్టేషన బెయిల్‌ ఇచ్చే కేసును కోర్టుకు తీసుకురావడమేమిటని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో  స్టేషన బెయిల్‌పై నాగేంద్రను పోలీసులు విడుదల చేశారు. మంత్రి అనిల్‌కుమార్‌ ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నాగేంద్రపై నానబెయిలబుల్‌ కేసు పెట్టారని టీడీపీ నగర ఇనచార్జ్‌ కోటంరెడ్డి ఆరోపించారు. 



ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక దాడులు


నెల్లూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, అవినీతి, అరాచకాలు, అన్యాయాలు పెరిగిపోతుండటంతో తట్టుకోలేక ప్రజలు ప్రశ్నించి స్థాయికి వచ్చారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. ఈ ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేయించిందని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం, డీజీపీ డెరెక్షనలో రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇది ప్రభుత్వ దాడి అని ఆయన దుయ్యబట్టారు. బుధవారం నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవనలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌తో కలిసి సోమిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం తప్ప సాధించింది ఏమీ లేదని దుయ్యబట్టారు. అంతా ప్రశాంతంగా ఉందంటూ డీజీపీ మాట్లాడటం ఏమిటో అర్థం కావడం లేదని, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మాటలు ఆయనకు వినిపించడం లేదా అని చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే తమ నేతలందరినీ హౌస్‌ అరెస్టులు, స్టేషనకు తరలించారని, కానీ వైసీపీ నేతలు మాత్రం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారని చెబుతూ ఫొటోలను కూడా ప్రదర్శించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. తమ అధినేత చంద్రబాబునాయుడు దీక్షకు నెల్లూరు జిల్లా నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లి మద్దతు తెలుపుతామని చెప్పారు. రాబోవు రెండన్నర సంవత్సరాల్లో టీడీపీ సత్తా ఏమిటో చూస్తారని, ఇక ఒక్క కార్యకర్తపై దాడి జరిగినా పదింతలు అనుభవిస్తారని సోమిరెడ్డి హెచ్చరించారు. 


బీద రవిచంద్ర మాట్లాడుతూ టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరోవైపు ఏపీఎస్పీ బెటాలియన ఉన్నాయని, దాడి జరుగుతోందని పోలీసులకు సమాచారమిచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. దాడికి ముందు అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరిగారని, అతను పోలీసు అని చెప్పారని, దీనిని బట్టి దాడికి పోలీసులే రెక్కీ నిర్వహించినట్లు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ మాట్లాడారని, ఆయన పోలీసు శాఖ తరపున మాట్లాడారా లేదా వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులో ఓ ఎస్పీని ఎమ్మెల్యేలు బహిరంగంగా తిడితే అప్పుడు పోలీసు వ్యవస్థ ఏమైందని రవిచంద్ర ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులతో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ప్రవర్తిస్తుందో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని గంజాయి స్థావరాలపై దాడులు చేశారని, దీనిపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. తమపై దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తే భయపడతామనుకోవడం అవివేకమని హితవు పలికారు. అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదు.. ప్రజలు ప్రశ్నించకూడదు.. జర్నలిస్టులు లోపాలను ఎత్తిచూపకూడదు.. అన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందంటూ సీఎం జగన్మోహనరెడ్డి మాట్లాడడం ఆయన అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు.  రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో బ్లాక్‌ డే అని ఆయన మండిపడ్డారు. గూగుల్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ అని కొడితే మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పేర్లు కనిపిస్తాయని, 420 అని కొడితే సీఎం జగన్మోహనరెడ్డి పేరు కనిపిస్తుందని విమర్శించారు. 



Updated Date - 2021-10-21T04:18:23+05:30 IST