ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు ఎలా పంచుతారు?

ABN , First Publish Date - 2020-04-09T09:22:57+05:30 IST

ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు ఎలా పంచుతారు?

ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు ఎలా పంచుతారు?

ఆర్డినెన్స్‌ కింద కూడా వీరు శిక్షార్హులు

ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

సాక్ష్యంగా 253 వీడియోలు అందజేత


అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కరోనా లా క్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నగదు, రేష న్‌ సాయాన్ని ప్రభుత్వ సిబ్బందికి బదులు.. స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్య లు తీసుకోవాలని కోరుతూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు లేఖ రా శారు. పేద కుటుంబాలకు రేషన్‌తోపాటు రూ. వె య్యి సాయం అందించాలని నిర్ణయించిన ప్రభు త్వం.. గ్రామ/వార్డు పెయిడ్‌ వలంటీర్ల ద్వారా వీటి పంపిణీ జరుగుతుందని ప్రకటించిందని, కానీ ఆచ రణలో వైసీపీ ‘స్థానిక’ అభ్యర్థులు, నాయకులే పం పిణీ చేశారని తెలిపారు. ప్రజాధనాన్ని వైసీపీ నేత లు ఇంటింటికీ పంపిణీ చేస్తూ తమకు ఓట్లు వే యాలని నిస్సిగ్గుగా కోరుతున్నారని ఆరోపించారు. యావత్‌ ప్రపంచం తన శక్తినంతా ఉపయోగించి కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తుంటే.. ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. తన ఆరోపణలకు రుజువులు కూడా ఆయన జతచేశారు. వైసీపీ అభ్యర్థులు, నేతలు నగదు పంపి ణీ చేస్తున్న దృశ్యాలున్న 253 వీడియోలను ఒక పెన్‌డ్రైవ్‌లో అందజేశారు.


ప్రచారంతో ముప్పు..

‘కరోనా వ్యాపిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల సామాజిక, రాజకీయ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కానీ రాష్ట్రంలో వై సీపీ నాయకులు మాత్రం ఇంటింటికీ రేషన్‌, నగ దు పంపిణీ పేరుతో పార్టీ కండువాలు ధరించి.. జెండాలు పట్టుకుని గుంపులుగా తిరుగుతూ పార్టీ ప్రచారం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జనా న్ని పోగేసుకుని గుంపులుగా వైసీపీ నేతలు చేస్తు న్న ఈ రకమైన ప్రచారం వల్ల ప్రజారోగ్యానికి పె ను ముప్పు ఏర్పడుతోంది. కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రాధాన్యం ఇవ్వకుండా స్థానిక ఎన్నిక ల ప్రచారానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని వివరించారు.

Updated Date - 2020-04-09T09:22:57+05:30 IST