Abn logo
Sep 20 2021 @ 19:23PM

టీడీపీ ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారమే వెళ్లింది: చంద్రబాబు

అమరావతి: సామాజిక న్యాయం కోసం టీడీపీ ఎప్పుడూ పాటుపడుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం జరగాలని చెప్పారు. దామాషా పద్ధతిలో అందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ టీడీపేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు దారుణమన్నారు. టీడీపీ ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారమే వెళ్లిందని తెలిపారు. నేరాలు, దౌర్జన్యాలకు పాల్పడాలని ఎన్నడూ టీడీపీ భావించలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు పాల్పడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండిImage Caption